స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఏనాడు చూడని విపత్తు కరోనా రూపంలో వచ్చిందని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. దాని కట్టడిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో మాట్లాడిన ఆయన.. ఒకే దేశం, ఒకే పన్ను, ఒకే మార్కెట్ విధానాన్ని అమలు చేస్తున్న మోదీ ప్రభుత్వం.. టీకా పంపిణీలో మాత్రం కేంద్రానికి ఒక ధర, రాష్ట్రానికి ఒక ధర అంటూ ఎందుకు వ్యత్యాసం చూపిస్తోందని ప్రశ్నించారు. వ్యాపార ధోరణి మాని మానవతా దృక్పథంతో ప్రజలందరికి టీకాలు ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్పొరేటర్లకు మినహాయింపు ఇచ్చిన మోదీ సర్కార్.. ప్రజలకు ఉచితంగా టీకా ఇవ్వడానికి ఎందుకు వెకాడుతోందన్నారు. సరైన సమయంలో మోదీ సరైనా నిర్ణయాలు తీసుకోకపోవడమే కరోనా ఉద్ధృతికి కారణమన్నారు.
'కరోనా కట్టడిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం'
కరోనా కట్టడిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. మోదీ సర్కార్ వ్యాపార ధోరణి మాని మానవతా ధృక్పథంతో ప్రజలందరికి టీకాలు ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మాట్లాడుతున్న మాజీ మంత్రి