కొత్తగా కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ వ్యవసాయ శాఖ మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు డిమాండ్ చేశారు. రైతు కన్నీరు దేశానికి మంచిది కాదని.. గతంలో అన్నదాతను నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వాలు కుప్పకూలిపోయాయని ఆయన అన్నారు. పార్లమెంటరీ నిబంధనలను తుంగలో తొక్కుతూ కాసుల కోసం కోట్ల రూపాయల ప్రజాధనాన్ని బడా బాబులకు కట్టబెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
రైతు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, నిత్యావసర వస్తువులపై పన్నులు ఇష్టం వచ్చినట్లు పెంచారని ఆయన మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ రేట్లు నెలలో నాలుగుసార్లు పెంచి సామాన్యులపై అధిక భారం మోపడాన్ని తప్పుపట్టారు. వీటి ప్రభావంతో రోజువారి కూలీ పని చేసుకునే వారు సైతం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు.
ఇదీ చదవండి:దేశ రక్షణకు మోదీ సర్కార్ 'హైవే స్కెచ్'!