కరోనాతో జీవితంలో ఊహించని అనుభవాలు ఎదురవుతున్నాయని మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విపత్కర పరిస్థితుల్లో సేవలందిస్తున్న వారికి జీవితాంతం రుణపడి ఉండాల్సిందేనని అన్నారు. వైద్యులు, పోలీసు,మీడియా, పారిశుద్ధ్య సిబ్బంది, తమ జీవితాలను త్యాగం చేస్తున్నారని కొనియాడారు. చెడులో మంచి వెతుక్కున్నట్లుగా కరోనా ప్రపంచవ్యాప్తంగా అందరిలో పెను మార్పులు తీసుకొచ్చిందన్నారు.
'సేవలందిస్తున్న వారికి జీవితాంతం రుణపడాలి' - మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వార్తలు
కరోనా వ్యాప్తి చెందకుండా సేవలందిస్తున్న ప్రతి ఒక్కరిని అభినందించారు మాజీ మంత్రి సోమిరెడ్డి. తమ ప్రాణాలు ఫణంగా పెట్టి పని చేస్తున్న వైద్యులు, పోలీసులు, మీడియా రంగాలను ఆయన కొనియాడారు.
ex-minister-somireddy