ఏపీలో పోలీసుల పాలన నడుస్తోందని కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్న మాటల్లో.. నూటికి నూరు శాతం నిజం ఉందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. ఏపీలో అరాచక, అవినీతి పాలన సాగుతోందని తాము ఎప్పటి నుంచో చెప్తున్నామన్నారు.
రాష్ట్రంలో పోలీసు రాజ్యం.. కేంద్ర మంత్రి చెప్పింది నిజం: సోమిరెడ్డి - తెదేపా నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తాజా వార్తలు
ఆంధ్రప్రదేశ్‌లో అరాచక పాలన సాగుతోందని తెదేపా నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో పోలీసుల పాలన నడుస్తుందని స్వయంగా కేంద్ర సహాయ మంత్రి అన్న మాటల్లో వాస్తవం ఉందని చెప్పారు.
ex minister somireddy
పోలీసులు మానసికంగా హింసిస్తున్నారని ఆరోపించారు. చిన్నచిన్న వాటిపై కేసులు పెడుతూ అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఏపీలో ప్రజల తిరుగుబాటు తప్పదని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఇదీ చదవండి:తెదేపా సానుభూతిపరుడు నలంద కిషోర్ అరెస్ట్
Last Updated : Jun 23, 2020, 1:20 PM IST