నగరపాలక ఎన్నికల్లో అధికార పార్టీ దౌర్జన్యాలు శ్రుతిమీరినా.. పోలీసులు చోద్యం చూస్తున్నారని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. కృష్ణాజిల్లా మచిలీపట్నం 13వ డివిజన్‌లో ఓటు వేసేందుకు వచ్చిన తెదేపా సానుభూతిపరుడు దినకరన్‌పై కొందరు దాడిచేయడంతో జిల్లా ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స అందించేందుకు వైద్యులు ముందుకు రాకపోవడం సిగ్గుచేటని.. బాధితుడిని పరామర్శించేందుకు వచ్చిన రవీంద్ర విమర్శించారు.
పేర్నినాని ఆదేశాలతో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి ఆరోపించారు. పోలింగ్ ముందురోజు రాత్రి నుంచి తెదేపా ఏజెంట్లు, ముఖ్యకార్యకర్తలపై తప్పుడుకేసులు పెట్టారన్నారు. బూత్‌లలో ఏజెంట్లే లేకుండా చేయాలని చూస్తున్నారని విమర్శించారు. దాడులు చేసి ఎన్నికల్లో గెలవలేరని.. అందుకు తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.