మచిలీపట్నం మార్కెట్ యార్డ్ మాజీ ఛైర్మన్ మోకా భాస్కరరావు హత్య కేసులో నిందితుడిగా ఉన్న.. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర బెయిల్ పిటిషన్పై మచిలీపట్నం జిల్లా కోర్టులో విచారణ జరిగింది. ఇప్పటికే నిందితుల స్టేట్మెంట్ మేజిస్ట్రేట్ ముందు రికార్డు చేసినట్లు కొల్లు రవీంద్ర తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.
మాజీ మంత్రి కొల్లు రవీంద్ర బెయిల్ పిటిషన్పై విచారణ - కొల్లు రవీంద్ర బెయిల్ పిటిషన్ వార్తలు
మాజీ మంత్రి కొల్లు రవీంద్ర బెయిల్ పిటిషన్పై మచిలీపట్నం జిల్లా కోర్టులో విచారణ జరిగింది. జైల్లో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్నందున బెయిల్ మంజూరు చేయాలని కొల్లు రవీంద్ర తరఫు న్యాయవాది న్యాయస్థానాన్ని కోరారు.
మాజీ మంత్రి కొల్లు రవీంద్ర బెయిల్ పిటిషన్పై విచారణ
పోలీసులు చెపుతున్నట్లుగా సాక్షులను ప్రభావితం చేసే అవకాశం లేదని కోర్టుకు విన్నవించుకున్నారు. ప్రస్తుతం జైల్లో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉండటంతో.. బెయిలు మంజూరు చేాయలని న్యాయస్థానాన్ని కోరారు. కొల్లు రవీంద్ర తరఫు న్యాయవాది వాదనలు విన్న న్యాయస్థానం జైల్లో ఎంత మంది కరోనా రోగులు ఉన్నారో నివేదిన తెప్పించుకుంటామనీ... తదుపరి విచారణ గురువారానికి వాయిదా వేసింది.
ఇదీ చదవండి:పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలపై సుప్రీం విచారణ వాయిదా