కరోనా వ్యాప్తి నివారణలో సీఎం జగన్ పూర్తిగా విఫలమయ్యారని మాజీమంత్రి జవహర్ విమర్శించారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ప్రతిరోజు పాజిటివ్ కేసుల వివరాలు రెండు నుంచి మూడుసార్లు ప్రభుత్వం బులెటిన్ విడుదల చేసేదన్నారు. ఇప్పుడు మాత్రం కేసుల వివరాలు బహిర్గతం చేయకుండా జిల్లా అధికారులను నియంత్రించి 24 గంటలకు ఒక బులెటిన్ విడుదల చేయటంపై అనుమానాలు ఉన్నాయన్నారు. కరోనా పరిస్థితిపై అసలు నిజాలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. కరోనాతో చనిపోయిన 31 మందికి ఎంతమేర ఆర్థిక సహాయం చేశారో చెప్పాలన్నారు. ప్రభుత్వం కంటే ముందు ప్రజలకే కేసుల వివరాలు తెలుస్తున్నాయని.. దీన్ని బట్టి యంత్రాంగం పనితీరు ఎలా ఉందో సీఎం చూడాలని ఎద్దేవా చేశారు.
'కరోనా నియంత్రణలో ప్రభుత్వం పూర్తిగా విఫలం' - ex minister jawahar comments on corona outbreak
కరోనా నియంత్రణలో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తోందని మాజీమంత్రి జవహర్ ఆరోపించారు. కరోనా కేసులపై సరిగా స్పష్టత ఇవ్వడం లేదన్న ఆయన.. పాజిటివ్ కేసుల పరిస్థితిపై అసలు నిజాలు బయటపెట్టాలన్నారు. అధికారుల కంటే ముందే ప్రజలకు కేసుల వివరాలు తెలుస్తున్నాయని ఎద్దేవా చేశారు.
!['కరోనా నియంత్రణలో ప్రభుత్వం పూర్తిగా విఫలం' 'కరోనా నియంత్రణలో ప్రభుత్వం పూర్తిగా విఫలం'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6950796-513-6950796-1587903956298.jpg)
'కరోనా నియంత్రణలో ప్రభుత్వం పూర్తిగా విఫలం'