కృష్ణా జిల్లా మైలవరం కీర్తిరాయుని గూడెంలో తెదేపా ఆధ్వర్యంలో పసుపు చైతన్యం కార్యక్రమాన్ని నిర్వహించారు. వైకాపా వ్యవహరిస్తున్న తీరు రైతులను అనేక ఇబ్బందులకు గురి చేస్తోందని మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. అకాల వర్షాలతో రైతులు నష్టపోయి ఉంటే పట్టించుకోకుండా.. పత్రికల్లో మద్దతు ధర ఇస్తున్నామని ప్రచారం చేసుకోవడం దారుణమని విమర్శించారు. దళారి వ్యవస్థను అరికట్టాల్సిన ప్రభుత్వమే.. రైతులను దళారులకు అప్పగించటం శోచనీయమన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ తెదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
'మద్దతు ధర ఇస్తున్నట్లు ప్రచారం చేసుకోవటం దారుణం' - pasupu chaithanyam latest news update
వైకాపా వ్యవహరిస్తున్న తీరు రైతులను అనేక ఇబ్బందులకు గురిచేస్తోందని మాజీ మంత్రి దేవినేని ఉమా ఆరోపించారు. కృష్ణా జిల్లా మైలవరం కీర్తిరాయుని గూడెంలో తెదేపా ఆధ్వర్యంలో పసుపు చైతన్యం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దేవినేని.. వైకాపా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కీర్తిరాయుని గూడెంలో తెదేపా ఆధ్వర్యంలో పసుపు చైతన్యం