ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటం'

మద్యం విషయంలో ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతున్నదని మాజీ మంత్రి అమర్ నాథ రెడ్డి విమర్శించారు. పలమనేరులో సోమవారం జరిగిన సంఘటనలో ఇద్దరి ప్రాణాలు బలి కావడమే ఇందుకు ఉదాహరణగా పేర్కొన్నారు.

ex minister amarnath reddy comments govt opening wine shops
ex minister amarnath reddy comments govt opening wine shops

By

Published : May 5, 2020, 6:46 PM IST

మద్యం అమ్మడంలో ప్రభుత్వం ఆదాయాన్ని చూస్తున్నది గానీ ప్రజలు ఎంతవరకు నష్ట పోతారు అన్నది పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి అమర్ నాథ్ రెడ్డి విమర్శించారు. కనీసం సామాజిక దూరం కూడా పాటించకుండా మద్యం దుకాణాల వద్ద జనం బారులు తీరుతున్నారని... ఈ విషయం లో ప్రభుత్వం తీసుకున్న చర్యలు పూర్తిగా విఫలం అని చెప్పారు.

కరోనా వ్యాప్తి చెందడానికి ఇది కారణం అవుతుందని అంచనా వేశారు. నిజంగానే ఆ పరిస్థితి వస్తే ఎలా.. అని ప్రశ్నించారు. గతంలో హామీ ఇచ్చినట్టు ఈ సమయానికి మద్యపాన నిషేధం చేసి ఉంటే ప్రజల ఆరోగ్యాన్ని నిజంగా కాపాడినవారు అయ్యి ఉండేవారని అభిప్రాయపడ్డారు. కరోనా కట్టడి అయ్యేవరకు మద్యం అమ్మకాలను నిలిపివేయాలని ప్రభుత్వానికి సూచన చేశారు.

ABOUT THE AUTHOR

...view details