ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'వరద వచ్చిన ప్రతిసారీ కష్టాలే...ప్రభుత్వమే ఆదుకోవాలి'

By

Published : Oct 15, 2020, 8:16 PM IST

కృష్ణమ్మ పోటెత్తటంతో విజయవాడ నగరంలో ప్రకాశం బ్యారేజీ దిగువన పలు కాలనీలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. వరద వచ్చిన ప్రతి సారీ కష్టాలు పడాల్సి వస్తోందని.. ప్రభుత్వం తమకు సాయం అందించాలని బాధితులు వేడుకుంటున్నారు.

వరద వచ్చిన ప్రతిసారీ కష్టాలే...ప్రభుత్వమే ఆదుకోవాలి
వరద వచ్చిన ప్రతిసారీ కష్టాలే...ప్రభుత్వమే ఆదుకోవాలి

కృష్ణమ్మ పోటెత్తటంతో విజయవాడ నగరంలో ప్రకాశం బ్యారేజీ దిగువన పలు కాలనీలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. రోజులు గడుస్తున్నా...వరద ఉద్ధృతి తగ్గక పోవటంతో ప్రజలు కష్టాల పాలయ్యారు. కుటుంబాలతో సహా కరకట్టపై చేరి ప్రాణాలు కాపాడుకున్న వీరంతా...వరద ఎప్పుడు తగ్గుతుందా అని ఎదురుచూస్తున్నారు. కట్టు బట్టలతో బయటకు వచ్చామని, ఇంట్లో వస్తువులన్నీ వరదలో కొట్టుకుపోయాంటూ కన్నీరు మున్నీరవుతున్నారు. తమను ఎవరూ పట్టించుకోవడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరద వచ్చిన ప్రతి సారీ కష్టాలు పడాల్సి వస్తోందని.. ప్రభుత్వం తమకు సాయం అందించాలని వేడుకుంటున్నారు.

పునరావాస కేంద్రాలకు వెళ్తేనే.. ఏర్పాట్లు సహా సాయం అందిస్తామని అధికారులు చెబుతున్నారని విచారం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రాల్లో కరోనా భయంతో తాము ఎక్కడికీ వెళ్లలేకపోతున్నామని వాపోయారు.

ABOUT THE AUTHOR

...view details