కైకలూరు నియోజకవర్గంలో ఏలూరు పార్లమెంట్ తెదేపా అభ్యర్థి మాగంటి వెంకటేశ్వరరావు ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా జామకాయలు అమ్మి.. వినూత్నంగా ఓట్లను అభ్యర్థించారు. తెదేపా ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలే విజయాన్ని సాధించి పెడతాయని ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో ప్రతి కార్యకర్త చురుగ్గా పనిచేస్తూ...తెదేపా గెలుపుకు కృషి చేయలన్నారు. సైకిల్ గుర్తుకు ఓటేసి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. మాగంటి బాబు తోపాటు కైకలూరు తెదేపా అసెంబ్లీ అభ్యర్థి జయమంగళ వెంకటరమణ ప్రచారంలో పాల్గొన్నారు.
పామర్రు తెదేపా అభ్యర్థి ఉప్పులేటి కల్పనఎన్నికల ప్రచారంలో దుసుకుపొతున్నారు. తొట్లవల్లురు మండలంలోని రొయ్యూరు,తొట్లవల్లురు తదితర గ్రామాల్లో పర్యటించి ప్రచారం నిర్వహించరారు. సైకిల్ గుర్తుకు ఓటేసి తన విజయానికి సహకరించాలని ఓటర్లను అభ్యర్థించారు.
ఇదీ చదవండి