ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ప్రతి 15 మంది ప్రయాణికులకు ఒక టికెట్​ కలెక్టర్​' - విజయవాడ రైల్వేస్టేషన్ లో ప్రయాణికులు

విజయవాడ రైల్వే స్టేషన్ రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లు ఏర్పాటుతో.. ప్రయాణికుల రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు రైల్వే శాఖ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. గతంలో కాకుండా నిబంధనలను పూర్తిగా మార్చివేశారు. స్టేషన్ సహా రైళ్లను తరచూ రసాయనాలతో శుద్ధి చేయడం సహా ప్లాట్ ఫాం పైన రంగులతో గడులు ఏర్పాటు చేయడం, భౌతిక దూరం పాటించడం లాంటి చర్యలను పటిష్టంగా అమలు చేస్తున్నారు. రైల్వే స్టేషన్ లో కరోనా వ్యాప్తి నివారణ కోసం తీసుకుంటోన్న చర్యలపై స్టేషన్ డైరెక్టర్ సురేష్​తో ఈటీవీ భారత్ ముఖాముఖి...

etv bharat interview with  vijayawada railway station Director suresh   etv bharat interview with  vijayawada railway station Director suresh
విజయవాడ రైల్వే స్టేషన్ డైరెక్టర్ సురేష్ తో ఈటీవీ భారత్ ముఖాముఖి

By

Published : May 17, 2020, 12:14 AM IST

విజయవాడ రైల్వే స్టేషన్ డైరెక్టర్ సురేష్ తో ఈటీవీ భారత్ ముఖాముఖి
  • ప్రశ్న: కరోనా నేపథ్యంలో పారిశుద్ధ్యం పరంగా విజయవాడ రైల్వేస్టేషన్​లో ఏ విధమైన చర్యలను తీసుకున్నారు?

న్యూదిల్లీ నుంచి చెన్నైకు, చెన్నై నుంచి న్యూదిల్లీకి వారానికి రెండురోజులకొకసారి రైళ్లతో మొత్తం నాలుగు రైళ్లు నడుస్తాయి. ఈ స్టేషన్ నుంచి సుమారుగా ప్రతిరోజు 300మంది ప్రయాణికులు వెళుతున్నారు.

  1. ప్రతి పదిహేనుమంది ప్రయాణికులకు ఒక టికెట్​ కలెక్టర్​ను కేటాయించాము.
  2. ఆరోగ్యసేతు యాప్ తప్పగా ఉండేలా చర్యలు తీసుకున్నాం
  3. థర్మల్ స్క్రీనింగ్, బ్యాగేజ్ స్క్రీనింగ్ చేస్తున్నాం
  4. ప్రయాణికులకు మాస్కులు, గ్లౌజులు వాడాలి.రెండు సార్లు చేతులను శానిటైజర్​తో శుభ్రం చేసుకోవాలి.
  5. కచ్చితంగా భౌతిక దూరం పాటించేలా మార్కింగే వేశాం.
  6. కోచ్​లను రెండు సార్లు శానిటైజ్ చేస్తున్నాం.
  • ప్రశ్న: రైల్వేస్టేషన్​లో ఎక్కడెక్కడా మార్కింగ్ బాక్సులు వేస్తున్నారు. ?

ప్రయాణికులు రిపోర్టు చేసే ప్రాంతం, కోచ్ దగ్గరకి వెళ్లేటపుడు, విశ్రాంతిగదిలో, రైలు ఎక్కుతున్నప్పుడు, దిగుతున్నప్పుడు భౌతిక దూరం పాటించేలా మార్కింగ్ వేశాం.

  • ప్రశ్న: ప్రత్యేక రైలులో ప్రయాణించాలంటే ప్రయాణికులు ఎలా రిజర్వేషన్ చేసుకోవాలి..?

ఐఆర్​టీసీ ద్వారా బుకింగ్ చేసుకోవాలి. 22వ తేదీ వరకు వెయింటింగ్ లిస్ట్ ఇవ్వలేదు. 22 తేదీ తర్వాత వెయింటింగ్ లిస్ట్ ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం.

  • ప్రశ్న: స్టేషన్​లో ప్రయాణికుల రద్దీని ఎలా పర్యవేక్షిస్తున్నారు..?

ప్రయాణికులు మూడు గంటల ముందుగానే రిపోర్టు చేయాలి. పది నిముషాల ముందే ప్లాట్​ఫాం వద్దకు చేరుకోవాలి. రైలు వెళ్లగానే స్టేషన్ మూసేస్తున్నాం.

  • ప్రశ్న: ప్రయాణికులు గమ్యస్థానంలో దిగగానే ఇంటికి వెళ్లడానికి ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు..?

రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వారిని ఇంటికి చేర్చుతుంది. ఓ యాప్​లో పేర్లను, జిల్లాలు నమోదు చేసి వారి చిరునామా ప్రకారం ఇంటికి చేర్చుతారు.

ఇదీచూడండి.

'వాళ్ల గురించి చెప్పినా.. తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు'

ABOUT THE AUTHOR

...view details