ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ప్రయాణికులు తప్పనిసరిగా మాస్కులు, గ్లౌజులు వాడాలి ' - విజయవాడ విమానాశ్రయం వార్తలు

సుమారు రెండు నెలల విరామం తర్వాత స్వదేశీ, విదేశీ ప్రయాణికులకు విమానయాన సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. విదేశాల్లోని ప్రవాసీయులను స్వస్థలాలకు తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం 'వందేభారత్' మిషన్‌ పేరిట ప్రత్యేక కార్యక్రమం అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ఈనెల 20 నుంచి విజయవాడ విమానాశ్రయానికి విదేశీ ప్రయాణికుల విమానాలు రానున్నట్లు పౌర విమానయాన శాఖ నుంచి సమాచారం అందింది. కరోనా ప్రభావ సమయంలో విజయవాడ విమానాశ్రయం వద్ద ఎయిర్‌పోర్టు అథారిటీ తీసుకుంటున్న ప్రత్యేక చర్యలపై ఎయిర్‌పోర్టు డైరెక్టర్ జి.మధుసూధనరావుతో మా ప్రతినిధి ముఖాముఖి.

etv bharat interview with  vijayawada Airport Director G. Madhusudhan Rao
విజయవాడ విమానాశ్రయం డైరెక్టర్ జి. మధుసూధన్ రావుతో ఈటీవీ భారత్ ముఖాముఖి

By

Published : May 16, 2020, 7:50 PM IST

విజయవాడ విమానాశ్రయం డైరెక్టర్ జి. మధుసూధన్ రావుతో ఈటీవీ భారత్ ముఖాముఖి
  • లాక్​డౌన్ సడలింపుల తర్వాత విమానాశ్రయాన్ని వాడుకలోకి తీసుకొచ్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?

ఇంతకముందు వచ్చే విమానాల సంఖ్య కంటే ఇప్పుడు తక్కువ ఉంటాయి. మా నుంచి కేంద్రప్రభుత్వం సమాచారం తీసుకుంది. హెడ్​క్వార్టర్స్ లెవల్​లో వారిచ్చిన సమాచారంతో స్లాట్​లను నిబంధనలు బట్టి బుక్ చేసుకుంటాం. ప్రయాణికులను 14 రోజులు క్వారంటైన్‌కు తరలించేందుకు అవసరమైన వాహనాలను సిద్ధం చేస్తున్నాం.

  • ఒక కోచ్​లో ఎంత మందికి అవకాశం కల్పిస్తారు..?

ఒక కోచ్​లో పదిమంది కంటే ఎక్కువ ఉండకూడదు. ప్రయాణికులు మూడు గంటల ముందుగానే రిపోర్టు చేయాలి..

  • విమానం దిగగానే ఎలాంటి చర్యలు తీసుకుంటారు..?

విమానం దిగగానే థర్మల్ స్క్రీనింగ్, శానిటైజేషన్ చేయనున్నాం. కన్వేయర్ బెల్ట్ దగ్గర మార్కింగ్, ఆరోగ్య ధృవీకరణ పత్రం, ఆరోగ్యసేతు యాప్ తప్పగా ఉండేలా చర్యలు తీసుకున్నాం

  • ప్రయాణికులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

బ్యాగేజ్ స్క్రీనింగ్, సిబ్బందికి ఫేస్ షీల్డ్, పీపీఈలు ఉంటాయి. ప్రయాణికులకు మాస్కులు, గ్లౌజులు వాడాలి. రెండు లేకపోతే విమానాశ్రయంలో కొనుక్కోవచ్చు. చెకింగ్ కౌంటర్స్ దగ్గర షీట్స్ పెట్టాం.

  • ఇన్ని జాగ్రత్తల మధ్య ఎంతమంది ప్రయాణికులు వచ్చే అవకాశముంది.?

లాక్​డౌన్ సడలింపులు చేస్తున్నారు కాబట్టి .. ప్రయాణికుల రాకపోకలు ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది.

  • ఎన్ని విమానాలు అందుబాటులో ఉన్నాయి..?

30శాతం కంటే ఎక్కువ విమానాలు ఉండవు. ఇంతకముందు 10 ఉండేవి..ఇప్పుడు మూడుకు కుదించారు.

  • విమానం లోపల ఆక్యుపెన్సీ ఇంతకముందులాగా 100 శాతం ఉంటుందా..? లేదా మార్పులు జరుగుతాయా..?

విమానంలో ఉన్న మార్పులు గురించి మాకు సమాచారం లేదు.

  • వందేభారత్మిషన్‌ మిషన్​లో భాగంగా దుబాయ్, ఇతర సౌదీ దేశాల నుంచి ఎంతమంది భారతీయులు విజయవాడకు రాబోతున్నారు.. వారికి ఎలాంటి చర్యలు తీసుకున్నారు.

20వ తేదీ నుంచి.. విజయవాడ - బాంబే విమానం వస్తోంది. ఇమ్మిగ్రేషన్ పనులును ప్రభుత్వం చూసుకుంటుంది. 20వ తేదీన రెండు విమానాలు వస్తాయి. యూఎస్ నుంచి వయా బాంబే మీదుగా విజయవాడకు ఉదయం 6:45కు రానుంది... రాత్రి 10:15కి 130 ప్రయాణికులతో మరో విమానం, 24న, 27న విమానాలు రానున్నాయి.

ఇదీచూడండి.ఈటీవీ-ఈటీవీ భారత్ కథనానికి స్పందన.. 'విధి వంచిత'కు ఆశ్రయం

ABOUT THE AUTHOR

...view details