ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కృష్ణాలో మత సామరస్య కమిటీలు ఏర్పాటు

మత సామరస్యం, పరస్పర సమ భావన, సహజీవన సౌభ్రాతృత్వం పరిరక్షణకు ప్రజలంతా కృషి చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్​ ఇంతియాజ్‌ పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జిల్లా, డివిజన్, గ్రామ స్థాయి మత సామరస్య కమిటీలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.

religious harmony committees
కృష్ణాలో మత సామరస్య కమిటీలు ఏర్పాటు

By

Published : Jan 10, 2021, 12:31 PM IST

జిల్లాలో మత సారస్య కమిటీలను కలెక్టర్ ఇంతియాజ్ ఏర్పాటు చేశారు. కమిటీకి కలెక్టరు ఛైర్మన్‌గానూ, నగర పోలీసు కమిషనరు, జిల్లా ఎస్పీ ఉపాధ్యక్షులుగానూ, హిందూ, ముస్లిం, క్రైస్తవ, సిక్కు, బుద్దిస్ట్‌, జైన తదితర మతాలకు చెందిన ప్రతినిధులు, దేవాదాయ శాఖ సహాయ కమిషనర్, మైనార్టీ శాఖ సహాయ సంచాలకులు సభ్యులుగానూ, జాయింటు కలెక్టరు మెంబరు కన్వీనరుగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. దేవాలయాలు, వివిధ ప్రార్థనా మందిరాల వద్ద 2,500 సీసీ కెమెరాలతో నిఘా ఉంచామని, గ్రామ/వార్డుల్లో 1000 రక్షక దళాలను ఏర్పాటు చేశామని చెప్పారు.

ఎక్కడైనా దుస్సంఘటనలు జరిగితే శాంతి, మత సామరస్యాన్ని కాపాడడానికి ఈ కమిటీ కృషి చేస్తుందన్నారు. దేవాలయాలు, మసీదులు, చర్చిల వద్ద మరిన్ని సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని విజయవాడ నగర పోలీసు కమిషనర్ అభిప్రాయపడ్డారు. అన్ని గ్రామ కమిటీల్లో పోలీసు సిబ్బంది ఉన్నట్టు కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు తెలిపారు. యువకులనూ సభ్యులుగా చేర్చి ఆలయాలను పరిరక్షించుకోవాలని సూచించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details