కృష్ణా జిల్లా గన్నవరం మండలం బుద్ధవరంలో కృష్ణా మిల్క్ యూనియన్ ఆధ్వర్యంలో నూతన పశు దాణా ఉత్పత్తుల కేంద్రాన్ని ప్రారంభించారు. విజయ డెయిరీ ఛైర్మన్ చలసాని ఆంజనేయులు వీటిని ప్రారంభించి మాట్లాడారు. డెయిరీ పశుపోషకుల శ్రేయస్సే లక్ష్యంగా తక్కువ ధరకు దాణా అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. తద్వారా నాణ్యమైన పాలను పొందవచ్చని పేర్కొన్నారు. దీనికి ముందు సంస్థ డైరెక్టర్లు, సిబ్బందితో కలిసి మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు.
కృష్ణా మిల్క్ ఆధ్వర్యంలో పశు దాణా ఉత్పత్తుల కేంద్రం ప్రారంభం - కృష్ణా మిల్క్ యూనియన్ తాజా వార్తలు
కృష్ణా జిల్లా బుద్ధవరంలో కృష్ణా మిల్క్ యూనియన్ ఆధ్వర్యంలో నూతన పశు దాణా ఉత్పత్తుల కేంద్రాన్ని ప్రారంభించారు. డెయిరీ రైతులకు నాణ్యమైన దాణా అందించడమే లక్ష్యంగా దీన్ని ప్రారంభించినట్లు నిర్వాహకులు తెలిపారు.
కృష్ణా మిల్క్ ఆధ్వర్యంలో పశు దాణా ఉత్పత్తుల కేంద్రం ప్రారంభం