దాతల ఔదార్యం: పేదలకు నిత్యావసరాలు పంపిణీ - దాతల ఔదార్యం :పేదలకు నిత్యవసరాలు పంపిణీ
కరోనా కారణంగా లాక్డౌన్ విధించటంతో పేదలు, వలస కూలీలు నిరాశ్రయులయ్యారు. వారిని ఆదుకునేందుకు పలువురు దాతలు ముందుకొస్తున్నారు.
![దాతల ఔదార్యం: పేదలకు నిత్యావసరాలు పంపిణీ పేదలకు నిత్యవసరాలు పంపిణీ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6978121-278-6978121-1588082574106.jpg)
లాక్డౌన్ నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన పేదలకు పలువురు దాతలు అండగా నిలుస్తున్నారు. కృష్ణాజిల్లా తిరువూరు మండలం ఎర్రమాడులో మహారాష్ట్ర వలస కూలీలకు శ్రీ వైష్ణవ యువత, శ్రీ షిర్డీ సాయిబాబా సేవా సమితి ప్రతినిధులు నిత్యావసర వస్తువులు, గోధుమ, జొన్న పిండి, కూరగాయలు, దుస్తులు వేర్వేరుగా పంపిణీ చేశారు. తిరువూరు మండలం కాకర్లలో తెలుగుదేశం పార్టీ నాయకుడు సుంకర కృష్ణమోహన్ ప్రజలకు కూరగాయలు పంపిణీ చేశారు. తిరువూరు పూర్వ విద్యార్థులు (దోస్త్) ప్రతినిధులు తమ బాల్యమిత్రులకు నిత్యావసరాలు, కూరగాయలు, కొంత నగదు అందజేశారు.