కృష్ణా జిల్లా తాడిగూడెంకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి బర్మా ఫణి బాబు దాతృత్వాన్ని చాటుకున్నారు. తాడిగూడెం, బూర్గుడెం గ్రామాల్లో లాక్డౌన్ కారణంగా పనల్లేక ఆర్థికంగా చితికిపోయిన 1250 కుటుంబాలకు నిత్యావసర వస్తువులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఐ శ్రీను, ఎస్సై శ్రీనివాసులు పాల్గొన్నారు. కష్టకాలంలో ప్రజలకు అండగా ఉండాలని ఈ కార్యక్రమం చేపట్టిన ఫణిబాబును వారు అభినందించారు. త్వరలో రైతులకు సైతం నిత్యావసరాలను అందిస్తామని దాత ఫణిబాబు తెలిపారు.
పేదలకు నిత్యావసరాలు అందించిన రియల్ ఎస్టేట్ వ్యాపారి - తాడిగూడెంలో లాక్డౌన్
పనుల్లేక ఆర్థికంగా చితికిపోయి పస్తులుంటున్న తాడిగూడెం, బూర్గుడెం గ్రామస్తులకు రియల్ ఎస్టేట్ వ్యాపారి నిత్యావసర వస్తువులు అందజేశారు. త్వరలో రైతులకు నిత్యావసర సరుకులు అందజేయనున్నట్లు వివరించారు.
పేదలకు నిత్యవసరాలు అందించిన రియల్ ఎస్టేట్ వ్యాపారి