ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఈఎస్ఐ కుంభకోణం... వెలుగులోకి రోజుకో కొత్త కోణం - ESI SCAM LATEST NEWS

బీమా వైద్య సేవల సంస్థ విభాగం కుంభకోణం దర్యాప్తులో అనిశా దూకుడు పెంచింది. కార్మికులకు ఔషధాల సరఫరా పేరుతో ఉన్నతాధికారులే కోట్లు దండుకున్న తేలగా.... మూలాల్లోకి వెళ్తున్న.. కొద్దీ రోజుకో కొత్త కోణం వెలుగు చూస్తోంది. ఈ కుంభకోణంలో తాజాగా మరో మహిళ ఫార్మాసిస్టును అరెస్టు చేయగా... మొత్తం అరెస్టుల సంఖ్య తొమ్మిదికి చేరింది.

ఈఎస్ఐ కుంభకోణం... వెలుగులోకి రోజుకో కొత్త కోణం

By

Published : Oct 7, 2019, 10:57 AM IST


బీమా వైద్య సేవల విభాగం మందుల కొనుగోలు కుంభకోణంపై అవినీతి నిరోధక శాఖ దర్యాప్తు ముమ్మరం చేసింది. తాజాగా ఈ వ్యవహారంలో నగరంలోని మరో నాలుగు చోట్ల అనిశా అధికారులు దాడులు నిర్వహించారు. వైద్య శిబిరాల నిర్వాహణ పేరుతో భారీగా సొమ్ము దండుకున్న వ్యవహారాన్ని మరింత లోతుగా విచారిస్తున్నారు.

తెర ముందుకు కొత్త పేరు...

తెలంగాణాలోని భూపాలపల్లి జిల్లా నందిగామకు చెందిన అరవింద్‌రెడ్డితో కుమ్మక్కై ఐఎంఎస్‌ అధికారులు అక్రమాలకు పాల్పడినట్టు ఏసీబీ గుర్తించింది. హైదరాబాద్‌ శివారులో 17 శాఖలున్న ఓ ప్రముఖ ఔషధ తయారీ సంస్థలోని కార్మికులకు ఈఎస్‌ఐ ద్వారా వైద్య సేవలందించేందుకు అరవిందరెడ్డి ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ క్రమంలోనే ఐఎంఎస్‌ ఉన్నతాధికారులతో పరిచయాలు ఏర్పడ్డాయి. కార్మికుల క్యాంపుల్లో వైద్య శిబిరాలు నిర్వహించినట్లు చూపించడం ద్వారా డబ్బు దండుకోవడం ప్రారంభించాడు. ఎంత మొత్తంలో దారి మళ్లించాడనేది తేల్చే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. అరవింద్​రెడ్డి నివాసంలో ఈఎస్‌ఐ ముద్రతో కూడిన ఔషధాలు లభించాయి. వాటిలో చాలా వరకు మందులకు కాలం చెల్లినట్టు బయటపడింది.

ఫార్మాసిస్టు నాగలక్ష్మి అరెస్టు...

మందుల కుంభకోణం కేసు విచారణలో భాగంగా అనిశా సనత్‌నగర్‌ ఈఎస్‌ఐ ఫార్మాసిస్టు నాగలక్ష్మిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. లైఫ్‌కేర్‌ ఫార్మా సంస్థ ఎండీ సుధాకర్‌రెడ్డి ఔషధాల సరఫరా పేరుతో దాదాపు రూ. 8.25 కోట్లు దండుకోవడంలో ఫార్మాసిస్టు సహకరించినట్టు బయటపడింది. ఇందుకోసం నకిలీ ఇండెంట్లు రూపొందించడంలో నాగలక్ష్మి కీలకంగా వ్యవహరించినట్టు గుర్తించారు.
ఇప్పటికే 9 మందిని ఈ వ్యవహారంలో అరెస్టు చేసిన అనిశా... మరి కొంతమందిని అరెస్టు చేయడానికి రంగం సిద్ధం చేస్తోంది.

ఈఎస్ఐ కుంభకోణం... వెలుగులోకి రోజుకో కొత్త కోణం

ఇవీ చూడండి: సడలని సర్కార్... మూడో రోజుకు చేరిన ఆర్టీసీ సమ్మె

ABOUT THE AUTHOR

...view details