ఈఎస్ఐ మాజీ డైరెక్టర్రమేశ్ కుమార్ను అవినీతి నిరోధక శాఖ అరెస్టు చేయటంపై ఆయన భార్య హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టులో విచారణ జరిగింది. రమేశ్ కుమార్కు అనిశా అధికారులు నోటీసు ఇవ్వకుండా... నిబంధనలకు విరుద్ధంగా అరెస్టు చేశారని పిటిషనర్ తరుఫు న్యాయవాది హైకోర్టులో వాదించారు. అనిశా అధికారులు రమేశ్ కుమార్ అరెస్టులో నిబంధనలు అతిక్రమించారని న్యాయస్థానానికి తెలిపారు. రమేశ్ కుమార్ అరెస్టు వెనుక రాజకీయ కుట్రకోణం ఉందని... ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది అభ్యర్థించారు.
'ఈఎస్ఐ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలి'
ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ రమేశ్ కుమార్ అరెస్టుపై ఆయన భార్య హైకోర్టును ఆశ్రయించారు. అవినీతి నిరోధక శాఖ అధికారులు రమేశ్ కుమార్ అరెస్టులో నిబంధనలు అతిక్రమించారని పిటిషనర్ తరఫు న్యాయవాది.. ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు. వినిపించారు. ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని అభ్యర్థించారు.
ap high court
అయితే... అరెస్టు ముందు నోటీసు ఇవ్వాల్సిన అవసరం లేదని ప్రభుత్వ తరఫు న్యాయవాది వాదించారు. రమేశ్ కుమార్ను ఇప్పటికే జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించామని న్యాయస్థానానికి తెలిపారు. ఇరువురి వాదనలు విన్న హైకోర్టు... కేసును రెగ్యులర్ కోర్టులో వింటామని తెలిపింది. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది.