స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదంపై విచారణ కమిటీని ప్రభుత్వం నియమించింది. ఆరోగ్య శ్రీ సీఈఓ, ప్రజారోగ్యశాఖ డైరెక్టర్‌తో కమిటీ ఏర్పాటు చేస్తూ వైద్యారోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. రమేష్ హాస్పిటల్లో అందిస్తున్న వైద్యం, హోటల్‌ను అద్దెకు తీసుకుని కోవిడ్ కేర్ కేంద్రంగా మార్చిన వైనం పైనా ఈ కమిటీ విచారణ చేయనుంది. రాష్ట్రంలోని ఇతర కొవిడ్ కేర్ కేంద్రాల పై కూడా దృష్టి సారించటంతో పాటు రోగుల భద్రత పై కూడా అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని కమిటీని ప్రభుత్వం ఆదేశించింది. 48 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వులలో పేర్కొంది.
స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాద ఘటనపై విచారణకు కమిటీ ఏర్పాటు - enquiry camitee on swarana palace incident
స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాద ఘటనపై విచారణకు కమిటీ ఏర్పాటు
07:54 August 10
స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాద ఘటనపై విచారణకు కమిటీ ఏర్పాటు
Last Updated : Aug 10, 2020, 9:35 AM IST