ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కృష్ణానదిలో ఈతకు దిగి ఇంజనీరింగ్‌ విద్యార్థి మృతి - Krishna river accidents latest news

కృష్ణానదిలో మునిగి ఇంజనీరింగ్ విద్యార్థి మృతిచెందాడు. అమరావతి కరకట్ట వెంబడి నదిలో ఈత నేర్చుకునేందుకు వెళ్లి మునిగిపోయాడు.

Engineering student merged in the Krishna River and died
కృష్ణానదిలో ఈతకు దిగి ఇంజనీరింగ్‌ విద్యార్థి మృతి

By

Published : Apr 4, 2021, 12:19 PM IST

కృష్ణానదిలో ఈతకు దిగిన ఇంజనీరింగ్‌ విద్యార్థి మృతి చెందాడు. అమరావతి కరకట్ట వెంబడి ఉన్న ప్రైవేటు స్విమింగ్ అసోసియేషన్‌లో ఆధ్వర్యంలో ఈత కొట్టేందుకు యువకుడు నదిలోకి దూకాడు. ఈతకొట్టలేక మునిగిపోయి మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు. మృతుడు విజయవాడలోని కృష్ణలంకుకు చెందినవాడని.. కృష్ణా జిల్లాలోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్‌ కళాశాలలో చివరి సంవత్సరం చదువుతున్నాడని పోలీసులు గుర్తించారు.

ABOUT THE AUTHOR

...view details