ఆంధ్రప్రదేశ్

andhra pradesh

నాటు సారా తయారీ కేంద్రాలపై ఎస్​ఈబీ దాడులు

By

Published : Aug 11, 2020, 3:00 PM IST

రాష్ట్రంలో నాటుసారా దందా ఊపందుకుంటోంది. సారా తయారీ నిషేధం అని చెప్పినా గుట్టుచప్పుడు కాకుండా సారా తయారు చేసేస్తున్నారు. ఎన్​ఫోర్స్​మెంట్​ అధికారులు ఎక్కడిక్కడ దాడులు జరిపి బెల్లం ఊటను ధ్వంసం చేశారు. సరకు స్వాధీనం చేసుకున్నారు.

పలుచోట్ల నాటుసారా తయారీ కేంద్రాలపై దాడులు
enforcement police officers raids on natusara centers in some dists of andhrapradesh

కడప జిల్లా ఓబులవారిపల్లె మండలంలో స్థానిక పోలీసులు, స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ బ్యూరో అధికారులు నాటుసారా తయారీ కేంద్రాలపై మెరుపు దాడులు చేశారు. భారీ ఎత్తున బెల్లం ఊట స్వాధీనం చేసుకున్నారు.

కోడూరు మండలంలోని వై. కోట ఫారెస్ట్ ఏరియాలో సారా తయారీ కేంద్రాలపై ఎన్​ఫోర్స్​మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. 1000 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు.

తూర్పు గోదావరి జిల్లా అమలాపురం రూరల్ మండలం రంగాపురంలో ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. నాటు సారా తయారీదారులు రహస్యంగా నిలువ చేసిన 1000 లీటర్ల బెల్లపు ఊటను ఎక్సైజ్ అధికారులు ధ్వంసం చేశారు.

నాటుసారాను అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని అనంతపురం జిల్లా గాండ్లపెంట పోలీసులు అరెస్ట్ చేశారు. తుమ్మల బైలు తండాకు చెందిన నాటుసారాను తరలిస్తున్న సమాచారం అందుకున్న ఎస్సై గురుప్రసాద్​రెడ్డి నిందితుడిని అదుపులోకి తీసుకుని.. ఆయన నుంచి 30 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకున్నారు.

తెలంగాణ నుంచి రాష్ట్రానికి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని కృష్ణాజిల్లా నందిగామ పోలీసులు పట్టుకున్నారు. 250 బాటిళ్ల అక్రమ మద్యాన్ని ద్విచక్రవాహనంలో తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చూడండి

కరోనా రోగులు 'రుచి' కోల్పోయేది అందుకే...

ABOUT THE AUTHOR

...view details