కృష్ణా జిల్లా పెడన మండలం కట్లపల్లి గ్రామంలో ఎస్ఈబీ ఏఎస్పీ ఆధ్వర్యంలో నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. ఈ ఆపరేషన్లో 100 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకుని.. 2500 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసినట్లు అధికారులు తెలిపారు. వంద మంది సిబ్బందితో సోదాలు నిర్వహించామని.. ఏడుగురిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. వారిని అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తామని చెప్పారు.
కట్లపల్లిలో 100 లీటర్ల నాటు సారా స్వాధీనం.. ఏడుగురు అరెస్ట్ - cordon search in Katlapally news
కృష్ణా జిల్లా పెడన మండలం కట్లపల్లి గ్రామంలో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. వంద లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకున్నారు.
కట్లపల్లిలో కార్డెన్ సెర్చ్