ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సమాచార లోపం వల్లే నిషేధిత జాబితాలో ఏపీ పేరు - పవర్ ఎక్స్ఛేంజ్‌ కొనుగోళ్లపై కె విజయానంద్

పవర్ ఎక్స్ఛేంజ్‌ల ద్వారా కొనుగోలు చేస్తున్న విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు AP ఎలాంటి బకాయిలూ లేదని ఇంధన శాఖ కార్యదర్శి కె.విజయానంద్ వెల్లడించారు. సమాచార లోపం వల్లే విద్యుత్ క్రయవిక్రయాల నిషేధిత జాబితాలో AP పేరు నమోదైందని ఆయన తెలిపారు.

power
power

By

Published : Aug 19, 2022, 12:11 PM IST

పవర్ ఎక్స్ఛేంజ్‌ల ద్వారా కొనుగోలు చేస్తున్న విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు AP ఎలాంటి బకాయిలూ లేదని ఇంధన శాఖ కార్యదర్శి కె.విజయానంద్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ బకాయిలు లేనట్టుగా కేంద్రం ఇచ్చిన జాబితాలో నమోదైందని ఆయన స్పష్టం చేశారు. దీంతో విద్యుత్ క్రయవిక్రయాల విషయంలో కేంద్రం విధించిన నిషేధం ఏపీకి వర్తించదని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ డిస్కమ్‌లు చెల్లించాల్సిన 350 కోట్ల రూపాయల మొత్తాన్ని ఇప్పటికే చెల్లించేశామని చెప్పారు. సమాచార లోపం వల్లే విద్యుత్ క్రయవిక్రయాల నిషేధిత జాబితాలో AP పేరు నమోదైందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ చెల్లించిన బకాయిల మొత్తం ఎక్స్ఛేంజ్‌లో నమోదు కాకపోవటం వల్లే ఈ పరిస్థితి ఉత్పన్నమైందని స్పష్టం చేశారు

ABOUT THE AUTHOR

...view details