భవిష్యత్తులో విద్యుత్తుకు తలెత్తే డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని భవన నిర్మాణాల్లో ఇంధన సంరక్షణ బిల్డింగ్ కోడ్(ఈసీబీసీ)ను అమలు చేయాలని ఇంధన సామర్థ్య సంస్థ(బీఈఈ) పేర్కొంది. ఈసీబీసీ 2017 అమలుకు జీవోను జారీచేయాలని రాష్ట్రాలకు సూచించింది. దీని అమలుతో 2030నాటికి భవనాల్లో వినియోగించే విద్యుత్‌లో 50శాతం ఆదా చేయాలన్న లక్ష్యాన్ని సాధించటం సాధ్యమవుతుందని పేర్కొంది. ఇందుకు ఇంధన, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలు చర్యలు చేపట్టాలని సూచించింది. ఈసీబీసీ అమలు, పురోగతిపై బీఈఈ డైరెక్టర్ జనరల్ అభయ్‌భాక్రే, కార్యదర్శి ఆర్కే రాయ్, ఈసీబీసీ డైరెక్టర్ సౌరభ్ వెబినార్ ద్వారా సమీక్షించారు. మల్టీప్లెక్స్‌లు, ఆస్పత్రులు, హోటళ్లకు విస్తీర్ణంతో సంబంధం లేకుండా ఈసీబీసీని వర్తింపచేయాలని సూచించారు. ఏపీఈఆర్‌సీ లెక్కల ప్రకారం రాష్ట్రంలో భవనాలరంగం విద్యుత్ డిమాండ్ 3,117 మి.యూనిట్లుగా ఉందని ట్రాన్స్‌కో సీఎండీ శ్రీకాంత్ తెలిపారు.
భవన నిర్మాణాల్లో ఈసీబీసీ అమలుచేయాలి - Energy Conservation Building Code
భవనాల్లో విద్యుత్ వాడుకను పొదుపు చేసేలా ఇంధన సంరక్షణ బిల్డింగ్ కోడ్(ఈసీబీసీ)ను అమలుచేయాలని ఇంధన సామర్థ్య సంస్థ(బీఈఈ) రాష్ట్రాలకు సూచించింది.
ఇంధన సామర్థ్య సంస్థ