కృష్ణా జిల్లాలో ది విజయవాడ ఫ్రీడమ్ పరుగును దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, వైకాపా నేత వరప్రసాద్‌తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. సమాజానికి అవసరమైన అంశాలను నినాదాలుగా చేసుకుని 5కె పరుగు నిర్వహించడం సంతోషంగా ఉందని మంత్రి అన్నారు. బీఆర్టీఎస్ రోడ్డులోని శారదా కళాశాల నుంచి మధురానగర్ వంతెన వరకు ఈ పరుగు సాగింది. సాగర్ సాఫ్ట్ వేర్ సొల్యూషన్స్, కేఎల్ యూనివర్సిటీ, డీసీబీ బ్యాంక్, విజయవాడ నగరపాలక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నిర్వహించిన విద్యార్దుల కళ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
విజయవాడ ఫ్రీడమ్ రన్లో పాల్గొన్న మంత్రి వెల్లంపల్లి - endowments minister vellampalli srinivas
ది విజయవాడ ఫ్రీడమ్ రన్లో దేవాదాయశాఖమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు.
endowments minister vellampalli srinivas paticipated in the vijayawada freedom run in krishna district