ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా నివారణకు హోమాలు, యాగాలు

కొవిడ్ నివారణకు, మానవాళి శ్రేయస్సు కాంక్షిస్తూ.. రాష్ట్ర వ్యాప్తంగా జపాలు, హోమాలు నిర్వహించాలని దేవాదాయశాఖ నిర్ణయించింది. ఈ నెల 16 తేదీ నుంచి ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణకు సన్నాహాలు ప్రారంభించింది.

endowments-departement-to-prevent-poojas-yagas-covid-19-in-ap
endowments-departement-to-prevent-poojas-yagas-covid-19-in-ap

By

Published : Jun 11, 2020, 6:50 AM IST

రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తోంది. వైరస్​ వ్యాప్తి నివారణకు, మానవళి శ్రేయస్సును కాంక్షిస్తూ.. ఈ నెల16 నుంచి జపాలు, హోమాలు నిర్వహించాలని దేవదాయశాఖ నిర్ణయించింది. 20 ప్రముఖ దేవాలయాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించాలని ఆ శాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. వేద పండితులు, రుత్వికులు, వేద పాఠశాల విద్యార్ధులు, ఆధ్యాత్మిక వేత్తలతో హోమాలు చేయాల్సిందిగా దేవదాయశాఖ తెలిపింది. ఇప్పటికే కొన్ని ప్రసిద్ధ దేవాలయాల్లో శాంతిహోమాలను నిర్వహిస్తున్నట్టు వివరించింది. ఆరోగ్య భారత యజ్జ్ఞాన్ని నిర్వహించాల్సిందిగా తితిదే బోర్డు సభ్యుడు సూచన చేశారని ఆ మేరకు అన్ని ప్రసిద్ధ ఆలయాల్లోనూ ఈ కార్యక్రమాలు చేస్తోన్నట్లు దేవాదాయశాఖ స్పష్టం చేసింది.

ABOUT THE AUTHOR

...view details