విజయవాడ ఇంద్రకీలాద్రిలో భవానీ దీక్షలు ముగిశాయి. అమ్మవారి సన్నిధికి చేరుకున్న భక్తులు దుర్గమ్మను దర్శించుకుని దీక్షను విరమించుకున్నారు. తెలుగు రాష్ట్రాలతోపాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దీక్షాధారులు కృష్ణా నదిలో పవిత్ర స్నానాలు ఆచరించారు. గురుభవానీల ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణలు చేశారు. యాగశాలలో ఆలయ స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద శర్మ ఆధ్వర్యంలో వైదిక కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు మహా పూర్ణాహుతి, కలశోధ్వాసన కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం.వి.సురేష్ బాబు సతీసమేతంగా పాల్గొన్నారు. వైదిక కమిటీ సభ్యులు లింగంభొట్ల దుర్గాప్రసాద్ దంపతులు భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించారు. సుమారు నాలుగు లక్షల మందికి పైగా భక్తులు ఈ దీక్షల్లో పాల్గొన్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
ఇంద్రకీలాద్రిలో ముగిసిన భవానీల దీక్ష
ఈనెల 18 నుంచి ప్రారంభమైన భవానీ దీక్షల విరమణ నేటితో ముగిసింది. సుమారు నాలుగు లక్షల మందికి పైగా భక్తులు ఈ దీక్షలో పాల్గొన్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
ఇంద్రకీలాద్రీలో ముగిసిన భవానీల దీక్ష