Employees protest against CPS : సీపీఎస్‌ను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలకు నల్లబ్యాడ్జీలతోనే హాజరై నిరసన తెలిపారు. సీపీఎస్ అమలైన సెప్టెంబరు 1 తేదీని ఉద్యోగుల పాలిట చీకటిదినంగా పాటిస్తున్నట్టు సీపీఎస్ ఉద్యోగులు స్పష్టం చేశారు. ఓపీఎస్‌ను పునరుద్ధరించాలంటూ సీపీఎస్ ఉద్యోగులు ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఏపీ సచివాలయంలోనూ జీపీఎస్‌ను వ్యతిరేకిస్తూ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఉద్యోగులు చేపట్టారు. ఓపీఎస్‌ను పునరుద్ధరించాలంటూ సంతకాలు సేకరించిన ఉద్యోగులు వినతిపత్రాన్ని సీఎస్ కార్యాలయానికి అందజేశారు. జీపీఎస్ ప్రతిపాదన (GPS proposal) కు వ్యతిరేకంగా సచివాలయంలో అన్ని బ్లాకుల నుంచి బయటకు వచ్చి సీపీఎస్ ఉద్యోగులు సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Prathidwani: ప్రభుత్వ ఉద్యోగుల పింఛను పోరాటం మళ్లీ ఉద్ధృతం కాబోతుందా?
సెప్టెంబర్ 1 చీకటి దినం.. సీపీఎస్ అమల్లోకి వచ్చిన సెప్టెంబరు 1 ఉద్యోగుల పాలిట చీకటిదినమని.. పాతపెన్షన్‌ను పునరుద్ధరించాలనే నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని ఏపీ సచివాలయ సీపీఎస్ అసోసియేషన్ వ్యాఖ్యానించింది. గతేడాది దీనిపై నిరనస తెలియచేసినందుకు ఉక్కుపాదంతో ప్రభుత్వం ఆందోళనను అణచివేసిందని తెలిపింది. సీపీఎస్ నుంచి బయటకు రాకుండా రాష్ట్ర ప్రభుత్వం జీపీఎస్ అంటోదని.. ఇదెలా సాధ్యమని నేతలు ప్రశ్నించారు. 3.5 లక్షల మంది సీపీఎస్ ఉద్యోగుల వాణిని మంత్రివర్గ ఉపసంఘానికి వివరించామనిఏపీ సచివాలయ సీపీఎస్ అసోసియేషన్ (AP Secretariat CPS Association)నేతలు వ్యాఖ్యానించారు. సీపీఎస్ ఉద్యోగుల కాంట్రిబ్యూషన్ సొమ్మును ఏం చేస్తారో ప్రభుత్వం చెప్పటం లేదని నేతలు ఆక్షేపించారు. ఠక్కర్ కమిటీ (Tucker Committee ) ప్రతిపాదనలు పక్కన పెట్టి జగన్ మాటలు నమ్మి ఓపీఎస్ ఇస్తారనిభ్రమపడ్డామని ఆరోపించారు. ఉద్యోగుల డబ్బుతోనే ఉద్యోగులకు పెన్షన్ ఇవ్వడమేమిటని అసోసియేషన్ నేతలు ప్రశ్నించారు. ఆర్డినెన్సు తెచ్చేముందు శాసనసభలో చర్చించాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ కంటే ప్రభుత్వం ప్రతిపాదించిన జీపీఎస్ దారుణంగా ఉందని.. దాన్ని అమలు చేసి లక్షలాది మంది ఉద్యోగులను ముంచొద్దని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.
Prepare GPS Proposed Ordinance as Alternative to CPS: జీపీఎస్‌లో పెన్షన్‌కు గ్యారంటీ లేనట్టేనా ?