ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాజమహేంద్రవరంలో మొదటి దిశ పోలీస్​ స్టేషన్​ ఏర్పాటు - ఏలూరు రేంజ్ డిఐజి ఏఎస్ ఖాన్ వ్యాఖ్యలు

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఈ నెల 7న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా మొట్ట మొదటి దిశ పోలీస్ స్టేషన్​ని ప్రారంభిస్తామని ఏలూరు రేంజ్ డీఐజీ ఏఎస్ ఖాన్ తెలిపారు. నాగాయలంక పోలీస్ స్టేషన్​ను సందర్శించిన ఆయన.. స్టేషన్ పరిధిలో నమోదైన కేసుల రికార్డులను పరిశీలించారు.

eluru range dig visite nagayalanka police station
నాగాయలంక పోలీస్ స్టేషన్​ను విజిట్​ చేసిన ఏలూరు రేంజ్ డిఐజి

By

Published : Feb 2, 2020, 11:59 AM IST

నాగాయలంక పోలీస్ స్టేషన్​ను సందర్శించిన ఏలూరు రేంజ్ డీఐజీ

తూర్పుగోదావరి జిల్లా నాగాయలంక పోలీస్​ స్టేషన్​ను ఏలూరు రేంజ్ డీఐజీ ఏఎస్ ఖాన్ సందర్శించారు. విద్యార్థులు, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, దాడులను నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా దిశ చట్టాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు. ఈ నెల 7న ముఖ్యమంత్రి చేతుల మీదుగా మొదటి దిశ పోలీస్​ స్టేషన్​ను రాజమహేంద్రవరంలో ప్రారంభించనున్నట్లు డీఐజీ వెల్లడించారు. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్​లో దిశా పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. స్టేషన్ పరిధిలో నమోదైన కేసులు, రికార్డులను ఆయన పరిశీలించారు. నూతనంగా ఏర్పాటు చేసిన ట్రాఫిక్ కమాండ్ కంట్రోల్ సిస్టం పనితీరును డీఐజీ సమీక్షించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details