కృష్ణా జిల్లా పరిధిలోని రెవెన్యూ డివిజన్ కేంద్రమైన నూజివీడు డీఎస్పీ కార్యాలయ పునర్నిర్మాణాన్ని ఏలూరు రేంజ్ డీఐజీ కె వి మోహన్ రావు ప్రారంభించారు. నిలిచిపోయిన పనులను స్థానిక ఎమ్మెల్యే మేకా ప్రతాప్ చొరవ చూపి తిరిగి ప్రారంభించటం అభినందనీయమని అన్నారు. కార్యాలయ భవన నిర్మాణం నిలిచిపోవడంతో ఎమ్మెల్యే ప్రతాప్ రూ.10 లక్షలు, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ రూ.10 లక్షలు, తిరువూరు ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణ నిధి రూ.10 లక్షలు వెచ్చించి మొత్తం రూ.30 లక్షలు అందించి భవన నిర్మాణానికి పూనుకున్నారని డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు.
నూజివీడు డీఎస్పీ కార్యాలయ పునర్నిర్మాణం ప్రారంభం - latest news in Nujeevedu
నూజివీడులోని డీఎస్పీ కార్యాలయ పునర్నిర్మాణాన్ని ఏలూరు రేంజ్ డీఐజీ కె వి మోహన్ రావు ప్రారంభించారు. ఆగిపోయిన పనులను స్థానిక ఎమ్మెల్యే మేకా ప్రతాప్ చొరవ చూపి నిర్మాణానికి పూనుకోవడం అభినందనీయమని అన్నారు.
నూజివీడు డీఎస్పీ కార్యాలయ పునర్నిర్మాణం ప్రారంభం
కార్యాలయ పనులు అర్ధాంతరంగా నిలిచి పోయి పశువులకు నిలయంగా మారడం విచారాన్ని కలిగించిందని ఎమ్మెల్యే ప్రతాప్ అన్నారు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, తిరువూరు ఎమ్మెల్యే రక్షణ నిధిని తాను స్వయంగా కోరగా అందుకు వారు ముందుకు రావడం సంతోషం కలిగిస్తోందని అన్నారు.
ఇదీ చదవండీ...కీలక నిర్ణయాలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోద ముద్ర