పలు కారణాలతో ఎన్నికలు నిర్వహించని గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు సిద్దమౌతున్నారు. కృష్ణా జిల్లాలోని 6 మండలాల్లో ఎన్నికలను జరపుతున్నట్లు అధికారులు తెలిపారు. గురువారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. 15 నుంచి ఎన్నికలు జరిపి.. అదేరోజు సాయంత్రం ఫలితాలు ప్రకటిస్తామని అధికారులు తెలిపారు.
విజయవాడ డివిజన్, తోట్లవల్లూరు మండలంలో భద్రిరాజుపాలెం, 10వ వార్డు, గుడివాడ డివిజన్, పామర్రు మండలం రిమ్మనపూడి 2, 6వ వార్డులు, నందివాడ మండలం చినలింగాల 2, 4, 8వ వార్డులు, మచిలీపట్నం డివిజన్, బంటుమల్లి మండలం, చినతుమ్మిడి 8వ వార్డు, గూడురు మండలం కోకానారాయణపాలెం 4వ వార్డు, నూజివీడు డివిజన్లోని నూజివీడు మండలం హనుమంతుల గూడెం 5వ వార్డుల్లో ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. ఇందుకోసం ఆయా గ్రామాల్లో నామినేషన్లు స్వీకరించేందుకు పంచాయతీ ఎన్నికల అధికారులను నియమించామని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు.