రాష్ట్రంలో స్థానిక సంస్థలతో పాటు పెండింగ్‌లో ఉన్న పురపాలక, పంచాయతీ ఎన్నికలను ఏప్రిల్ నెలాఖరులోగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. పెండింగ్ స్థానాల వివరాలను పంచాయతీరాజ్, పురపాలక శాఖల నుంచి సేకరించడంతో పాటు ఎన్నికలు జరగకపోవడానికి కారణాలను ఆరా తీసింది. ఆయా పనుల్ని పూర్తి చేయటానికి ఉన్న అవకాశాలపై మరింత సమాచారం సేకరించింది.
దశల వారీగా..
ఈనెల 8న పరిషత్ ఎన్నికల పోలింగ్ పూర్తైన వెంటనే మిగిలిన స్థానాలకు కూడా దశల వారీగా నోటిఫికేషన్లు ఇవ్వనుంది. ఆయా చోట్ల అవరోధాల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు పంచాయతీరాజ్ శాఖ, ఎన్నికల సంఘానికి నివేదించినట్లు సమాచారం. వాటిలో కొన్ని ప్రాంతాలు పురపాలక, నగరపాలక సంస్థల్లో విలీనమయ్యాయి.