ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లయోలా కళాశాలలో పోలింగ్​ని పరిశీలించిన.. ఎన్నికల కమిషనర్‌ - ఆంధ్రా లయోలా కళాశాలపై నిమ్మగడ్డ రమేష్‌కుమార్ వ్యాఖ్యలు

విజయవాడ నగరంలోని ఆంధ్రా లయోలా కళాశాలలో పోలింగ్ సరళిని ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ పరిశీలించారు. నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ఇదే కళాశాలలో ఇంటర్మీడియట్‌ తొలి బ్యాచ్‌ విద్యార్థిగా విద్యను అభ్యాసించారు. దీంతో కళాశాల పట్ల తనకున్న అనుబంధాన్ని ఈటీవీతో ప్రత్యేకంగా పంచుకున్నారు.

election commissioner nimmagadda ramesh kumar
లయోలా కళాశాలలో పోలింగ్ సరళిని పరిశీలించిన నిమ్మగడ్డ

By

Published : Mar 10, 2021, 1:48 PM IST

లయోలా కళాశాలలో పోలింగ్ సరళిని పరిశీలించిన నిమ్మగడ్డ

విజయవాడ నగరానికి ఆంధ్రా లయోలా కళాశాల ఓ మణిహారం. ఇక్కడ చదివిన వారెందరో వివిధ రంగాల్లో రాణించారు. ప్రస్తుత ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ కూడా ఇదే కళాశాలలో ఇంటర్మీడియట్‌ తొలి బ్యాచ్‌ విద్యార్థిగా విద్యాభ్యాసం పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్‌ సరళి పర్యవేక్షణకు వచ్చిన ఆయన కళాశాల మొత్తం కలియతిరిగారు. నాటి స్మృతులను గుర్తుచేసుకున్నారు. కళాశాల పట్ల తనకున్న అనుబంధాన్ని ఈటీవీతో ప్రత్యేకంగా పంచుకున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details