రాష్ట్ర వ్యాప్తంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల నిర్వహణకు తక్కువ సమయం ఉండటంతో జిల్లాల్లో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి వెబ్‌కాస్టింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు.
పలు ఏకగ్రీవాలు..
ఇప్పటికే కొన్ని చోట్ల జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు.. చురుగ్గా సన్నాహాలు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగుకుండా ఆయా జిల్లాల ఎస్పీలు చర్యలు చేపట్టారు.