ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

murder: కత్తితో పొడిచి... తమ్ముడిని హతమార్చిన అన్న - vijayawada murder news

అన్నదమ్ముల మధ్య ఘర్షణ ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. చిన్నగా మొదలైన గొడవ ఒకరి ప్రాణాన్ని బలితీసుకుంది. అన్న చేతిలో తమ్ముడు దారుణ హత్య గురైన ఘటన కృష్ణా జిల్లాలో జరిగింది.

murder
హత్య

By

Published : Jul 6, 2021, 3:40 PM IST

విజయవాడ నగర శివారు కండ్రిక కాలనీలో అన్నదమ్ముల మధ్య వివాదం తమ్ముడి హత్యకు దారితీసింది. కండ్రిక రామాలయం వీధిలో నివాసముంటున్న షరీఫ్, ఫైరోజ్ అనే అన్నదమ్ముల మధ్య ఉదయం ఘర్షణ జరిగింది.

ఈ గొడవలో షరీఫ్​పై అతని అన్న ఫైరోజ్ కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో షరీఫ్ మృతి చెందాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. హత్యకు ఉపయోగించినట్టుగా కనిపించిన ఓ కత్తిని స్వాధీనం చేసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details