ఈనాడు స్పోర్ట్స్ లీగ్ జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు విజయవాడ గ్రామీణం గూడవల్లిలో రెండో రోజు ఉత్సాహంగా కొనసాగాయి. మొత్తం మూడు మ్యాచ్‌ల్లో 6 జట్లు పోటాపోటీగా తలపడ్డాయి. మొదటి మ్యాచ్‌లో కేసీపీ సిద్ధార్థ కళాశాల... శ్రీ గాయత్రి జూనియర్ కళాశాలపై విజయం సాధించింది. రెండవ మ్యాచ్‌లో లింగయ్య ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ జట్టును లక్కిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాల జట్టు ఓడించింది. మూడవ మ్యాచ్‌లో అమ్రిత సాయి కళాశాల జట్టు.. ఎన్ఆర్ఐ ఇంజనీరింగ్ కళాశాల జట్టుపై గెలిచింది. ఈనాడు సంస్థ నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్‌కు తాము గత మూడేళ్లుగా వస్తున్నామని క్రీడాకారులు తెలిపారు. ప్రతి ఏడాది తమలో క్రీడాస్ఫూర్తిని ఈ టోర్నమెంట్ నింపుతోందని చెప్పారు.
గూడవల్లిలో రెండో రోజు జోరుగా ఈనాడు స్పోర్ట్స్ లీగ్ - eenadu cricket tournment news in goodavalli
ఈనాడు సంస్థల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్పోర్ట్స్ లీగ్ క్రికెట్ పోటీలు విజయవాడ గ్రామీణం గూడవల్లిలో రెండో రోజు ఉత్సాహంగా కొనసాగాయి.
eenadu sports league second day in goodavalli