ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తొమ్మిదో రోజూ.... అదే ఉత్సాహం - eenadu cricket league

ఈనాడు - ఈతరం క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈనాడు స్పోర్ట్స్ లీగ్ 2019 క్రికెట్ పోటీలు ఉత్సాహభరితంగా కొనసాగుతున్నాయి. గూడవల్లి డీజేఆర్ ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో జరుగుతున్న ఈ పోటీలు తొమ్మిదో రోజుకు చేరాయి.

eenadu sports league 2019
తొమ్మిదో రోజూ.... అదే ఉత్సాహం

By

Published : Dec 25, 2019, 10:50 AM IST

తొమ్మిదో రోజూ.... అదే ఉత్సాహం

కృష్ణా జిల్లా గూడవల్లి డీజేఆర్ ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో జరుగుతున్న ఈనాడు స్పోర్ట్స్ లీగ్ 2019 పోటీలు తొమ్మిదో రోజుకు చేరాయి. జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో నాలుగు మ్యాచ్ లు జరిగాయి. జూనియర్స్ విభాగం మొదటి మ్యాచ్ లో పీబీ సిద్ధార్ధ జూనీయర్ కళాశాల, ఉషా రామా పాలిటెక్నిక్ కళాశాల జట్లు పోటి పడగా... 46 పరుగుల తేడాతో పీబీ సిద్ధార్ధ జూనియర్ కళశాల జట్టు విజయం సాధించింది. రెండో మ్యాచ్ సీనియర్స్ విభాగంలో వీఆర్ సిద్ధార్ధ ఇంజనీరింగ్ కళాశాల, పీవీపీ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల జట్లు తలపడగా... మూడు వికెట్ల తేడాతో పీవీపీ సిద్ధార్ధ ఇంజనీరింగ్ కళాశాల జట్టు విజేతగా నిలిచింది.

సీనియర్స్ విభాగం మూడో మ్యాచ్ లో ఆంధ్రా లయోలా కళాశాల, నలంద డిగ్రీ కళాశాల జట్లు పోటీపడగా... నలంద డిగ్రీ కళాశాల జట్టు విజయం సాధించింది. నాలుగో మ్యాచ్ లో శ్రీ విద్యా డిగ్రీ కళాశాల, కేబీఎన్ కళశాల జట్లు ఆడాయి. ఈ మ్యాచ్ లో కేబీఎన్ కళాశాల జట్టు విజయం సాధించింది.

ABOUT THE AUTHOR

...view details