అండర్ గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్ పరీక్షలపై సీఎం జగన్‌తో చర్చించి, పరీక్షల నిర్వహించడం, రద్దు చేయడంపై నిర్ణయం తీసుకుంటామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. అందరి నుంచి వచ్చిన అభిప్రాయాలను సీఎం దృష్టికి తీసుకెళ్తామని వెల్లడించారు. పరీక్షల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై విశ్వవిద్యాలయాల ఉపకులపతులు, ఉన్నతాధికారులతో మాట్లాడి సూచనలు తీసుకున్నామన్నారు.
ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు ఆన్‌లైన్ పరీక్షలు
ట్రిపుల్ ఐటీ ఇంజినీరింగ్ చివరి ఏడాది, ప్రీ యూనివర్సిటీ కోర్సు (పీయూసీ) రెండో ఏడాది విద్యార్థులకు బహుళైచ్చిక ప్రశ్నావళితో ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించనున్నట్లు కులపతి కేసీ రెడ్డి తెలిపారు. మిగతా విద్యార్థులను ప్రస్తుతం పై తరగతులకు పంపిస్తామని, కరోనా పరిస్థితులు చక్కబడిన తర్వాత పరీక్షలు నిర్వహిస్తామన్నారు.