ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'దక్షిణకొరియా సహకారంతో రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి' - education minister meet south korea experts group

రాష్ట్రంలోని విద్య, ఐటీ, పరిశ్రమలు తదితర రంగాల్లో పెట్టుబడుల కోసం దక్షిణ కొరియా ఆసక్తి చూపిస్తోందని అన్నారు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్​. ఆ దేశ సహకారంతో ఏపీలో స్టార్టప్​, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఎక్కువమంది ఉపాధ్యాయ వృత్తికి ప్రాధాన్యతనిస్తున్నారన్న మంత్రి సాంకేతిక విద్యకు సంబంధించిన అంశాలపై కూడా దక్షిణకొరియా సహకారాన్ని తీసుకుంటామని పేర్కొన్నారు.

'దక్షిణకొరియా సహకారంతో రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి'

By

Published : Sep 20, 2019, 3:07 PM IST

దక్షిణ కొరియా సహకారంతో రాష్ట్రంలో స్టార్టప్​, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్​ తెలిపారు. ఏపీలో పర్యటించిన 60 మంది దక్షిణ కొరియా సభ్యుల బృందంతో సచివాలయంలో విద్యారంగ అవకాశాలపై చర్చించారు. ఏపీ - దక్షిణకొరియా మధ్య పాఠశాల, ఉన్నత, సాంకేతిక విద్యలో పరస్పర సహకారం ఇచ్చిపుచ్చుకునే అంశాలను ప్రస్తావించారు. విద్య, ఐటీ, పరిశ్రమలు తదితర రంగాల్లో పెట్టుబడుల కోసం దక్షిణ కొరియా ఆసక్తి చూపిస్తోందని అన్నారు. రాష్ట్రంలో దక్షిణకొరియా కేంద్రం... అలాగే ఆ దేశంలోని బుసాన్ నగరంలో ఏపీ కేంద్రం ఏర్పాటుపై పరిశీలన చేస్తున్నట్లు వివరించారు. విద్యారంగంలో సంస్కరణల కమిటీలను కూడా త్వరలోనే ఏర్పాటు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.

'దక్షిణకొరియా సహకారంతో రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details