ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 11, 2019, 10:38 PM IST

ETV Bharat / state

'విద్యా పరంగా ప్రభుత్వ లక్ష్యం నెరవేరేలా పని చేయాలి'

రాష్ట్రంలో విద్యాపరంగా ప్రభుత్వ లక్ష్యం నెరవేరేలా ప్రణాళికతో పనిచేయాలని విద్యాశాఖ మంత్రి  ఆదిమూలపు సురేష్​ అధికారులను ఆదేశించారు. సీఎం జగన్మోహన్​రెడ్డి విద్యాశాఖపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు తెలిపిన ఆయన పాఠశాల అభివృద్ధిలో పేరెంట్స్​ కమిటీలను భాగస్వాములను చేయాలని సూచించారు.

మంత్రి ఆదిమూలపు సురేష్​

'విద్యా పరంగా ప్రభుత్వ లక్ష్యం నెరవేరేలా పని చేయాలి'

రాష్ట్రంలో పాఠశాలల అభివృద్ధి, సంస్కరణలు, తదితర విషయాల్లో ప్రభుత్వ లక్ష్యం నెరవేరేలా అధికారులు పక్కా ప్రణాళికతో పని చేయాలని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆదేశించారు. సచివాలయంలో అధికారులతో సమీక్షించిన మంత్రి.. ముఖ్యమంత్రి జగన్మోహన్​రెడ్డి విద్యాశాఖ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని చెప్పారు. మనబడి కార్యక్రమంలో భాగంగా 'నాడు-నేడు' కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలన్నారు. పాఠశాలల్లో మౌలిక వసతులు, భవనాల మరమ్మతులు, నూతన ప్రతిపాదనలపై చర్చించారు. జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా పాఠశాల ప్రహరీలకు అంచనా ప్రతిపాదనలు తయారు చేయాలని పేర్కొన్నారు. కొత్తగా ఏర్పడిన పేరెంట్స్ కమిటీలకు ఆయా విధి విధానాలపై తగిన శిక్షణ ఇవ్వాలని సూచించారు. పాఠశాలల అభివృద్ధిలో వారిని భాగస్వాములను చేయాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details