పాఠశాలల్లో పేరెంట్స్ కమిటీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించామని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. 46,612పాఠశాలల్లో విద్యాశాఖ ఎన్నికలు నిర్వహించిందని,రికార్డు స్థాయిలో ఫలితాలు వచ్చాయని తెలిపారు.ఒకే రోజు96శాతం పాఠశాలల్లో పేరెంట్స్ కమిటీలు ఏర్పాటు పూర్తయ్యాయని పేర్కొన్నారు. 63శాతం స్కూళ్లలో ఏకగ్రీవంగా ఎన్నికలు పూర్తయ్యాయని,33శాతం పాఠశాలల్లో ఓటింగ్ ద్వారా ఎన్నికల ప్రక్రియ జరిగినట్లు వివరించారు.పకడ్బందీ విద్యాహక్కు చట్టం అమలుకే ఈ ఎన్నికలని ఆదిమూలపు తెలిపారు.
'పాఠశాలల్లో పేరెంట్స్ కమిటీ ఎన్నికలు ప్రశాంతం' - school parents election committee elections
పకడ్బందీగా విద్యాహక్కు చట్టం అమలుకే పాఠశాలల్లో పేరెంట్స్ కమిటీ ఎన్నికలని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించామన్న ఆయన,46,612 పాఠశాలల్లో విద్యాశాఖ ఎన్నికలు నిర్వహించిందని తెలిపారు.
విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్