ఉన్నత ప్రమాణాలతో విద్యకు కృషి: మంత్రి సురేష్ - suresh
సంస్కరణల కమిటీతో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ సమావేశమయ్యారు. కమిటీ ప్రతిపాదనలు పరిగణలోకి తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. కమిటీకి కావలసిన నిధులు మంజూరు చేస్తామని భరోసా ఇచ్చారు.
education-expert-committee-meeting
రాష్ట్ర విద్యా విధానంలో సంస్కరణల కోసం నియమించిన నిపుణుల కమిటీ సభ్యులతో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ సమావేశం నిర్వహించారు. విద్యార్థులకు ఉత్తమ ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకు కమిటీ సభ్యుల ప్రతిపాదనలు పరిగణనలోకి తీసుకుంటామని మంత్రి అన్నారు. కమిటీకి కావలసిన నిధులు మంజూరు చేస్తామన్నారు.