మార్చి ఒకటో తేదీ నుంచి నాలుగు రోజుల పాటు పాఠశాలలకు సెలవులంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. కొద్ది రోజులుగా ఈ తరహా వైరల్ అవుతున్న వార్తలపై స్పందించిన పాఠశాల విద్యాశాఖ కమిషనర్.. ఈ అంశంపై స్పష్టత ఇస్తూ ప్రకటన విడుదల చేశారు. సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అవుతున్న వార్తల్లో నిజం లేదని, ఇది పూర్తి అవాస్తవమని, దీనిని ఎవరూ నమ్మవద్దని సూచించారు. పాఠశాలలు యథావిధిగా నడుస్తాయని, అందులో ఎటువంటి సందేహం లేదని స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పాఠశాలలకు సెలవులంటూ వైరల్.. అవాస్తవమన్న అధికారులు - schools running in andhrapradhesh
కరోనా కారణంగా నాలుగు రోజుల పాటు పాఠశాలలకు సెలవులంటూ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వార్తలు పూర్తి అవాస్తవమని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. వదంతులు సృష్టిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ హెచ్చరించారు.
'పాఠశాలలకు సెలవులంటూ వైరల్.. అవుతున్న వార్తలు అవాస్తవం'