Delhi Liquor Scam Update : దిల్లీ మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో ఈడీ అధికారులు వేగం పెంచారు. దిల్లీ మద్యం పాలసీ రూపకల్పన సమయంలో వివరాలపై ఫోకస్ పెట్టారు. దిల్లీ, ఏపీ, తెలంగాణ మధ్య ప్రత్యేక విమానాల్లో ప్రయాణించిన వారిపై దృష్టి సారించారు. రాజకీయ నేతలు, వ్యాపారుల సమాచారాన్ని విశ్లేషిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే శరత్‌చంద్రారెడ్డి భార్య నడుపుతున్న విమానయాన సంస్థ వివరాలను ఈడీ అధికారులు సేకరించారు.
దిల్లీ, ఏపీ, తెలంగాణ మధ్య ప్రత్యేక విమానాల్లో ఎవరు ప్రయాణించారు..? - Delhi Liquor Scam Update
Delhi Liquor scam updates: దిల్లీ మద్యం కుంభకోణంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. గతనెల 17న ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్‌కు ఈడీ డిప్యూటీ డైరెక్టర్ లేఖ రాశారు. శరత్ చంద్రారెడ్డి భార్య నడుపుతున్న జెట్ సెట్ గో విమానయాన సంస్థ వివరాలను కోరింది.
దిల్లీ మద్యం కుంభకోణం
ఈ విమానాల్లో ఏపీ, తెలంగాణ రాజకీయ ప్రముఖులు ఎక్కువగా ప్రయాణించినట్లు సమాచారం. ప్రయాణ వివరాలు విశ్లేషించి అనుమానం ఉన్న అంశాలను క్రోడీకరిస్తున్నట్లు తెలుస్తోంది. గతనెల 18 తర్వాత వచ్చిన డేటాలో సమాచారం ఆధారంగా ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇవాళ, రేపట్లో మరికొందరి విచారణ, అదుపులోకి తీసుకునే అవకాశాలున్నారు. ఇప్పటికే శరత్‌చంద్రారెడ్డి, బినోయ్‌బాబు, విజయ్ నాయర్, అభిషేక్ బోయినపల్లి ఈడీ కస్టడీలో ఉన్నారు.
ఇవీ చదవండి :