ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లెక్కింపు ప్రక్రియకు భారీ బందోబస్తు - ద్వివేది

రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కౌంటింగ్‌ కేంద్రాల వద్ద అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. దీనిపై పోలీస్ పరిశీలకుడు కేకే శర్మ ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదితో భేటీ అయ్యారు.

police

By

Published : May 22, 2019, 3:04 PM IST

లెక్కింపు ప్రక్రియకు భారీ బందోబస్తు

ఎన్నికల ఫలితాల లెక్కింపునకు సంబంధించి భద్రతా ఏర్పాట్లపై పోలీస్‌ పరిశీలకుడు కేకే శర్మ, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదితో భేటీ అయ్యారు. ఇరువురూ కలిసి రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. రాష్ట్రంలో కౌటింగ్ బందోబస్తు కోసం 90 కంపెనీల పారా మిలటరీ బలగాలు వినియోగిస్తున్నట్టు కేకే శర్మ తెలిపారు. ఒక్కో కౌంటింగ్ కేంద్రం వద్ద... రాష్ట్ర పోలీసులతో పాటు 300 మంది కేంద్ర సాయుధ బలగాలు మోహరించనున్నాయి. 36 కౌంటింగ్ కేంద్రాల వద్ద.... సీఆర్‌పీఎఫ్ దళాలు పహారా కొనసాగుతుందని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. ఈసీ జారీ చేసిన పాసులు ఉన్నవారికే కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతిస్తామని స్పష్టం చేశారు. రేపు ఎన్నికల ఫలితాల లెక్కింపు నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలు, బార్లు మూసివేయాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. 23వ తేదీ ఉదయం 5 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5 గంటల వరకూ ఈ నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయి.

ABOUT THE AUTHOR

...view details