కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో భాగంగా నిర్మాణ పనుల మెటీరియల్ కోసం విడుదల చేసిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయకుండా నిలిపివేయడంపై ఉపాధి హామీ మండలి సభ్యులు రాష్ట్ర గవర్నర్‌కు వినతిపత్రం అందజేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలిసి... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా కలిపి మొత్తం రూ.1,961 కోట్లు విడుదల కావాల్సి ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలు పాటించకపోతే , భవిష్యత్‌లో ఉపాధి నిధులు నిలిపివేస్తామనే కేంద్ర ప్రభుత్వం హెచ్చరికను పరిగణలోకి తీసుకోవడం లేదని ఫిర్యాదు చేశారు. వచ్చే మూడు రోజుల్లో కేంద్రం నుంచి వచ్చిన నిధులు... పనులు చేసిన వారికి చెల్లించేలా ఆదేశాలు జారీ చేయించాలని విజ్ఞప్తి చేశారు.
గవర్నర్‌ను కలిసిన ఉపాధి హామీ మండలి సభ్యులు - central govt rules on eas funds
ఉపాధి హామీ పథకంలో భాగంగా నిర్మాణ పనులకు మెటీరియల్ కోసం కేంద్రం విడుదల చేసిన నిధులను రాష్ట్ర సర్కారు మంజూరు చేయకపోవడంపై ఉపాధి హామీ మండలి సభ్యులు గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్‌కు వినతిపత్రం అందజేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా కలిపి మొత్తం రూ.1,961 కోట్లు విడుదల కావాల్సి ఉందని తెలిపారు. వెంటనే నిధులు విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

గవర్నర్‌ను కలిసిన ఉపాధి హామీ మండలి సభ్యులు
గవర్నర్‌ను కలిసిన ఉపాధి హామీ మండలి సభ్యులు