కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయానికి అరుదైన గౌరవం దక్కింది. తమ సిబ్బంది రాకపోకలు సాగించడానికి కాలుష్యరహిత ఎలక్ట్రిక్ కార్లనీ వినియోగించే విమానాశ్రయంగా పేరు తెచ్చుకుంది. దేశంలోనే మొదటిసారిగా ఎలక్ట్రిక్ కార్లను స్థానిక ఎంపీ వల్లభనేని బాలశౌరి లాంఛనంగా ప్రారంభించారు. వీటితో పాటు విమానాశ్రయంలో విపత్కర పరిస్థితుల్లో వినియోగించే ఆపరేషన్ లేజరేన్ ఆఫ్ మహల్ కమాండ్ పోస్ట్ వాహనాన్ని ప్రారంభించారు. ఈ వాహనాన్ని రాష్ట్రంలో ఉపయోగిస్తోన్న వాటిలో గన్నవరం విమానాశ్రయం రెండోది. దీని సాయంతో ప్రతికూల పరిస్థితుల్లో అధికారులు, విమాన పైలెట్‌కు సంకేతాలు సులభంగా పంపవచ్చని విమానాశ్రయం డైరెక్టర్ మధుసూదన రావు తెలిపారు. గన్నవరం విమానాశ్రయం ఇప్పటికే సోలార్ పవర్ ద్వారా ఒక మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి చేసే విమానాశ్రయంగా పేరు పొందిందని ఎంపీ వల్లభనేని తెలిపారు. నేటి నుంచి పూర్తిస్థాయిలో ఎలక్ట్రిక్ కార్లను సిబ్బంది వినియోగించేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని విమానాశ్రయ అధికారులు తెలిపారు.
గన్నవరం విమానాశ్రయం అరుదైన ఘనత.. వినియోగంలోకి ఎలక్ట్రిక్ కార్లు - e-cars launched at gannavaram airport in krishna district
తమ సిబ్బంది కాలుష్యరహిత వాహనాల్లో రాకపోకలు సాగించేలా... ఎలక్ట్రిక్ కార్లను గన్నవరం విమానాశ్రయం అధికారులు వినియోగంలోకి తెచ్చారు. విమానాశ్రయంలో ప్రతికూల పరిస్థితులు ఉత్పన్నమైనప్పుడు తట్టుకునేలా ప్రత్యేక వాహనాన్ని స్థానిక ఎంపీ వల్లభనేని బాలశౌరి ప్రారంభించారు.
గన్నవరం విమానాశ్రయ సిబ్బందిరాకపోకలకు ఎలక్ట్రిక్ కార్లు