ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పేదలకు సరకులు పంచిన ద్వారావతి ఫౌండేషన్ - ద్వారావతి ఫౌండేషన్ వార్తలు

విజయవాడ వన్​టౌన్​లో ద్వారావతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో... నిరుపేదలకు, కూలీలకు నిత్యావసర సరకులు, ఆహారాన్ని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ప్రారంభించారు. ద్వారావతి ఫౌండేషన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.

dwaravathi foundation distributes essential commodities and food in vijayawada
ద్వారావతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేదలకు సరుకుల పంపిణీ

By

Published : May 13, 2020, 6:16 PM IST

విజయవాడ వన్ టౌన్ లో.. ద్వారావతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో... చలవాది మల్లిఖార్జున రావు ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో... పేదలు, కూలీలకు సరకులు, ఆహార పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్​రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

15 రోజుల పాటు 500 మంది వలస కూలీలకు, పేదలకు నిత్యావసర సరుకులు, ఆహారం పంపిణీ చేయడాన్ని అభినందించారు. మూగ జీవాలకు సైతం కూరగాయలు, ఆకుకూరలు తాగునీరు అందిస్తూ... ద్వారావతి ఫౌండేషన్ దాతృత్వం చాటుకుంటుందని మంత్రి వెల్లంపల్లి కొనియాడారు.

ABOUT THE AUTHOR

...view details