ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'దసరా పండగ రద్దీ కారణంగా ప్రత్యేక రైళ్లు' - హైదరాబాద్ రైల్వే స్టేషన్ వార్తలు

దసరా పండగా సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే వివిధ రాష్ట్రాలనుంచి ప్రత్యేక రైళ్లను నడపనుంది. హైదరాబాద్ వరకు ప్రత్యేక రైళ్లు నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటనలో తెలిపారు.

Dussehra special trains starts from hyderabad
ప్రత్యేక రైళ్లు

By

Published : Oct 15, 2020, 10:12 PM IST


దసరా పండగ రద్దీ కారణంగా దక్షిణ మధ్య రైల్వే మరిన్ని ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది. కాచిగూడ నుంచి మైసూరు, హైదరాబాద్ నుంచి జైపూర్, హైదరాబాద్ నుంచి రక్సుల్​కు మధ్య ప్రత్యేక రైళ్లు ప్రారంభమవనున్నాయి. ఈనెల 20 నుంచి 29 వరకు ప్రతి రోజూ కాచిగూడ నుంచి మైసూర్​కు రాత్రి 7.05 గంటలకు ప్రత్యేక రైలు నడవనుంది. ఈనెల 21 నుంచి 30 వరకు ప్రతి రోజూ మైసూర్ నుంచి కాచిగూడకు ప్రత్యేక రైళ్లు నడుపుతుండగా..ప్రతి రోజూ మధ్యాహ్నం 3.15 గంటలకు ఇవి బయలుదేరతాయి. ఈనెల 21నుంచి నవంబర్ 25 వరకు వారంలో రెండు రోజులు హైదరాబాద్ నుంచి జైపూర్​కు వెళ్లనున్నాయి. ఈనెల 21,26,28, నవంబర్ 2,4,9,11,16,18,23,25 తేదీల్లో రాత్రి 8.30 గంటలకు రైలు బయలుదేరనుంది. ఈనెల 23 నుంచి నవంబర్ 27 వరకు వారంలో రెండు రోజులు జైపూర్ నుంచి హైదరాబాద్ కు ప్రత్యేక రైళ్లు రానున్నాయి.

ఈ నెల 23,28,30, నవంబర్ 4,6,11,13,18,20,25,27 తేదీల్లో మధ్యాహ్నం 3.20 గంటలకు జైపూర్ నుంచి అధికారులు ఏర్పాటు చేశారు. ఈనెల 22 నుంచి నవంబర్ 26 వరకు ప్రతి గురువారం హైదరాబాద్ నుంచి రక్సుల్​కు మధ్య ప్రత్యేక రైలు ప్రారంభంకానుంది. ఈనెల 22,29 , నవంబర్ 5,12,19,26 తేదీల్లో రాత్రి 11.15 గంటలకు హైదరాబాద్ నుంచి రక్సుల్ కు వెళ్లనుంది. ఈనెల 25 నుంచి నవంబర్ 29 వరకు ప్రతి ఆదివారం రక్సుల్ నుంచి హైదరాబాద్ ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశారు. ఈనెల 25,నవంబర్ 1,8,15,22,29 తేదీల్లో ఉదయం 3.25 గంటలకు రక్సుల్ నుంచి హైదరాబాద్ ప్రత్యేక రైళ్లు నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటనలో తెలిపారు.

ఇదీ చూడండి.విజయవాడ వాసులకు దసరా కానుక...అందుబాటులో కనకదుర్గ ఫ్లైఓవర్

ABOUT THE AUTHOR

...view details